USGet the app
Post

ఢిల్లీ: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి సహకరించాల‌ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశామని, భూ నిర్వాసితులకు పరిహారాన్ని వేగంగా అందజేస్తున్నామని ప్రధానమంత్రికి వివరించారు.

✅ శ్రీ నరేంద్ర మోదీ గారితో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. సమావేశంలో కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

✅ ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు +152 మీటర్ల వద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

✅ మహారాష్ట్రలో ముంపునకు అవసరమైన పరిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ సాగునీటి అవసరాల దృష్ట్యా తుమ్మిడిహెట్టికి మహారాష్ట్రను ఒప్పించాలని ముఖ్యమంత్రి గారు కోరారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో తెలంగాణలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గ్రావిటీ ద్వారా నీటిని వినియోగించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.

✅ డాక్టర్ ఎస్. జైపాల్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS), సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు (SSMP), డిండి ఎత్తిపోతల పథకం (DLIS) లపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేసినా పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో తాగునీటి ప్రయోజనాలు అందడం లేదని ప్రధానమంత్రి గారికి వివరించారు.

✅ పర్యావరణ అనుమతుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చినందున ఏమాత్రం ఆలస్యం లేకుండా పర్యావరణ, ఇతర అనుమతులు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

✅ సాస్కి (Scheme for Special Assistance to States for Capital Investment) కింద తెలంగాణకు అదనంగా రూ. 5,000 కోట్లు మంజూరు చేయాలని సీఎం గారు కోరారు. తెలంగాణలో 70 నుంచి 90 శాతం మేర పూర్తయిన ప్రాజెక్టులకు ఈ నిధులు వినియోగించుకుంటామని చెప్పారు.

✅ ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ నిధులు…

0Like0Dislike0Comments0Shares

Comments 0

No comments yet. Be the first to share your view in the app.

Comment, like and follow sources in the free Beloud app.