పత్రికా ప్రకటన
నవంబర్ 13, 2026 – ఆదిలాబాద్
*నీటి లభ్యతకు అనుగుణంగా రబీ పంటల సాగు ప్రణాళిక రూపొందించాలి*
*ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు*
రాబోయే రబీ 2026-27 సీజన్లో ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగును తగ్గించి, ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
శుక్రవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు, విద్యాశాఖ, విద్యా మౌలిక సదుపాయాలు, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, VB-GRAMG పనుల పురోగతిపై సీఎస్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రైతులకు నీటి లభ్యతను బట్టి పంటల ఎంపికపై అవగాహన కల్పించాలని, పంటల వైవిధ్యీకరణతో పాటు సూక్ష్మ సేద్య పద్ధతులను ప్రోత్సహించాలని సీఎస్ సూచించారు. రైతు ఐడీ నమోదు, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటు, ఖరీఫ్ ఉత్పాదకత పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయించిన రైతులకు సైతం కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ అందేలా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను ముందుగానే సిద్ధం చేసి రైతుల వివరాల నమోదు పూర్తి చేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఎఫ్ఆర్ఎస్ విధానం ద్వారా పర్యవేక్షిస్తూ కనీసం 90 శాతానికి పెంచాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుదలకు డిజిటల్ అభ్యసన వేదికలను వినియోగించుకోవాలన్నారు.
రూసా 2.0, పీఎం ఉషా, సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ పథకాల కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి, మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11 వేల కోట్లతో చేపట్టిన 87 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులను, రూ.1,108 కోట్లతో మంజూరైన 115 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను నిర్ణీత…

0Like0Dislike0Comments1Shares
Comments 0
No comments yet. Be the first to share your view in the app.
Comment, like and follow sources in the free Beloud app.