*రైతులకు అండగా ఉంటాం.. పంట రుణాల రీషెడ్యూల్కు ప్రయత్నం*
* *ఫసల్ బీమా ఉంటే ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు పరిహారం వచ్చేది*
*పత్తి రైతులకు భరోసా.. రుణాల రీషెడ్యూల్పై ప్రభుత్వంతో చర్చలు*
*ఎమ్మెల్యే పాయల్ శంకర్*
ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి కొనుగోళ్లను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ముందుగా పత్తి బండ్లకు పూజలు నిర్వహించి, రైతులను సన్మానించి మిఠాయిలు తినిపించారు. అనంతరం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రైతులకు ఫసల్ బీమా పంటల బీమా పథకం అమలులో ఉండి ఉంటే ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు పరిహారం లభించే అవకాశం ఉండేదని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచిస్తోందని తెలిపారు. ఈ ఏడాది రైతులు తీసుకున్న పంట రుణాలను రీషెడ్యూల్ చేయడం లేదా 10 నుంచి 12 వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించే అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.రానున్న రోజుల్లో పత్తి సాగుతో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రాయితీలు కల్పించే అంశంపై ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. రైతులు పత్తికి ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు చిన్న చిన్న గ్రామస్థాయి గోదాముల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ మంజూరు దశలో ఉందని తెలిపారు. ప్రతి గ్రామంలో గోదాం ఏర్పాటు చేస్తే రైతులకు పంట నిల్వ విషయంలో ఇబ్బందులు తగ్గడంతో పాటు గ్రామపంచాయతీలకు కూడా కొంత ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు.
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడమే కాకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైతు మార్కెట్లను మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంతరం సందర్శిస్తూ రైతుల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.స్ప్రింక్లర్ల కోసం ఇంకా దరఖాస్తు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అదనంగా మరో 2 వేల స్ప్రింక్లర్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.మద్దతు ధర కంటే తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలోకి వచ్చి కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు ఉంటాయని అన్నారు. మద్దతు ధర…

0Like0Dislike0Comments1Shares
Comments 0
No comments yet. Be the first to share your view in the app.
Comment, like and follow sources in the free Beloud app.